Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ హీరో కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే.. కలెక్షన్లు, రికార్డుల గురించే అంతటా చర్చ నడుస్తుంది. ధనుష్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ కెప్టెన్ మిల్లర్ (Captain Miller). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కొద్ది సేపటి క్రితమే షురూ అయింది.
తమిళనాట ఇప్పుడంతా కెప్టెన్ మిల్లర్ ఫీవర్ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ధనుష్ అభిమానులు, డ్యాన్స్, అరుపులు, కేకలతో స్టేడియం పరిసరాలన్నీ మార్మోగిపోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ధనుష్ క్రేజ్ ఎలా ఉందో మరోసారి ఈ వీడియోలతో అర్థం చేసుకోవచ్చు. ధనుష్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కిల్లర్ కిల్లర్ (Killer Killer) నెట్టింటిని షేక్ చేస్తోంది. సాంగ్‌లో ధనుష్ కెప్టెన్ మిల్లర్‌గా ఎర్రటి స్కార్ప్ కట్టుకొని చేతిలో తుపాకీతో అగ్రెసివ్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు.
ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్‌లో అలరించిన ప్రియాంకా మోహన్ ఈ సారి యాక్షన్ అవతార్‌లో కొత్త యాంగిల్‌ను అందరికీ పరిచయం చేయబోతున్నట్టు ఇప్పటికే విడుదల చేసిన లుక్స్ చెబుతున్నాయి. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, నివేదితా సతీశ్, అమెరికన్ యాక్టర్, ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్డ్ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో వస్తోన్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shivarajkumar) మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న కెప్టెన్ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కెప్టెన్ మిల్లర్ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సరిగమ సొంతం చేసుకుంది. పొంగళ్ కానుకగా జనవరి 2024లో రిలీజ్ కానుంది.
@dhanushkraja fans and the dj vibing to udhungada sangu !!❤️🤩 #CaptainMiller#CaptainMillerPreReleaseEventpic.twitter.com/wCUxwH3TZR
— Viswa (@its_ViswaDfan) January 3, 2024
Vintage D na song vibe..🔥✊#CaptainMiller #CaptainMillerPreReleaseEvent pic.twitter.com/QxgDSIuBwZ
— Aᴋᴀꜱʜ Sғᴄ 𝕏 (@Akash_Suriya27) January 3, 2024
Vibe starts vintage songs🔥🔥💥#CaptainMillerPreReleaseEvent#CaptainMiller@dhanushkraja Anna ❤️
pic.twitter.com/jOkFrhP0r6— Chocoboy2.oˢᵃⁿᵗʰᵒˢʰ (@San_D28) January 3, 2024
Pure DHANUSHISM on Nehru Stadium 😍#CaptainMillerPreReleaseEvent #CaptainMiller @dhanushkraja
pic.twitter.com/f2IQXyFgQc— . (@Dharsan__Offl) January 3, 2024
@dhanushkraja pure Vibe ❤️🔥❤️🔥❤️🔥❤️🔥
The stage is getting ready for the #CaptainMillerPreReleaseEvent !!🔊🔥 @dhanushkraja #CaptainMiller @SathyaJyothi pic.twitter.com/2h2B9Yekey
— WORLD ONLINE DHANUSH FC™ ツ (@WorldODFCOffl) January 3, 2024
Vintage D na song vibe..🔥✊#CaptainMiller #CaptainMillerPreReleaseEvent@dhanushkrajapic.twitter.com/L9TgXGOxls
— 𝓫𝓪𝓭 𝓼𝓪𝓽𝓱𝓲𝓼𝓱 420 ™ 𓃵 (@420Dfanboy) January 3, 2024
The Blood Bath… #CaptainMilIer From Pongal 2024! @dhanushkraja ACTING MONSTER pic.twitter.com/7KMdRMgMq9
— Chowdrey (@Chowdrey_) December 22, 2023
కిల్లర్ కిల్లర్.. కెప్టెన్ మిల్లర్ సాంగ్..
కెప్టెన్ మిల్లర్ టీజర్..