హాలీవుడ్ ప్రాజెక్టు ది గ్రే మ్యాన్‌తో ఇంటర్నేషనల్ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). ఈ స్టార్ యాక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం సార్ (Sir). తమిళంలో వాథి (Vaathi) అనే టైటిల్‌తో తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమాను డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు వార్తలు వస్తుండగా..దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని టాక్. మలయాళ భామ సంయుక్తామీనన్ ఈ ప్రాజెక్టులో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ధనుష్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుండటం విశేషం.
నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ డైరెక్టర్. రీసెంట్గా విడుదలైన తిరు సినిమా తమిళనాడులో హౌస్‌ఫుల్ షోలతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ధనుష్ మరోవైపు శేఖర్ కమ్ములతో బైలింగ్యువల్ సినిమా చేయాల్సి ఉండగా..ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.