Dhanashree Verma – Biggboss 19 | భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య, ప్రముఖ డ్యాన్సర్ ధనశ్రీ వర్మ, హిందీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా వచ్చే సీజన్ 19లో ధనశ్రీ వర్మ పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇప్పటికే ఆమె బిగ్‌బాస్ నిర్వాహకులతో చర్చలు జరిపినట్లు, ఆమె ఎంట్రీ దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. కాగా దీనికి సంబంధించి బిగ్ బాస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బిగ్‌బాస్ సీజన్ 19 ఆగస్టు చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సీజన్ బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం (దాదాపు 5 నెలలు) సాగుతుందని చెబుతున్నారు. ధనశ్రీ వర్మతో పాటు ‘ఇండియన్ ఐడల్ 5’ ఫేమ్ శ్రీరామ చంద్ర, యూట్యూబర్ పూరవ్ జా, రాజ్ కుంద్రా, ఫైజల్ షేక్ వంటి ప్రముఖులు కూడా ఈ సీజన్లో పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి..
ధనశ్రీ వర్మ కెరీర్ విషయానికి వస్తే.. డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే 2020 డిసెంబర్లో క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది ధనశ్రీ. అయితే వీరిద్దరి రిలేషన్షిప్లో సమస్యలు తలెత్తడంతో 2025 మార్చి 20న ముంబై ఫ్యామిలీ కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత ధనశ్రీ తన కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల రాజ్ కుమార్ రావు నటించిన ‘భూల్ చుక్ మాఫ్’ చిత్రంలోని ‘టింగ్ లింగ్ సజ్నా’ అనే పాటలో డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది.