RT75 | టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో ఒకటి రవితేజ (Raviteja), శ్రీలీల (Sreeleela). ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ధమాకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిందని తెలిసిందే. ఇప్పటికే ప్రకటించిన మాస్ మహారాజా బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ రవితేజ 75 (RT75) నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో షురూ అయింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్లో నిర్మాతలు, డైరెక్టర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ మూవీ లాంఛింగ్ స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పేరు లక్ష్మణ భేరి.. ఆదాయం చెప్పను తియ్.. ఖర్చు లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం అన్ లిమిటెడ్..అవమానం జీరో అంటూ ఇప్పటికే ఆర్టీ75లో మాస్ మహారాజా పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెరకెక్కిస్తున్నారు. బలగం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 2025లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా రానుంది.
ఈ మూవీతో సామజవరగమన ఫేం రైటర్ భాను బొగవరపు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తు్న్నాడు. హ్యాపీ ఉగాది రా భయ్.. రవన్న దావత్ ఇస్తుండు రెడీ అయిపోండ్రి అంటూ పోస్టర్ పెట్టిన క్యా్ప్షన్స్ పక్కా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగనున్నట్టు క్లారిటీ ఇచ్చేస్తుంది. రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ మూవీలో నటిస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది. ధమాకాలో ఇరగదీసే డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మరోసారి రవితేజ, శ్రీలీల మరోసారి పూనకాలు తెప్పించడం ఖాయమంటూ తెగ సంబురాలు చేసుకుంటున్నారు మూవీ లవర్స్.
RT75 పూజా కార్యక్రమం ఫొటోలు..
Gear up for an ultimate mass entertainer! 🔥🤙🏻
𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐉𝐀 @RaviTeja_offl ~ #RT75 Launched officially with a pooja ceremony today! 💫✨
Shoot begins from Today! 🔥
A Sankranthi 2025 Release. 🥳@sreeleela14 @BhanuBogavarapu @vamsi84 #SaiSoujanya #BheemsCeciroleo… pic.twitter.com/V6scL2SK01
— Sithara Entertainments (@SitharaEnts) June 11, 2024
Exclusive : #Raviteja – #Sreeleela
Shoot begings from June , Sankranthi Release !#RT75 pic.twitter.com/cnnaNxFxHW
— Rajesh Manne (@rajeshmanne1) May 27, 2024
RT75 పోస్టర్..
అందరికి హ్యాపీ ఉగాది రా భయ్ 😎
We are elated to announce our next with the 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐉𝐀 @RaviTeja_offl ~ #RT75, Shoot Begins Soon! 🔥
వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు… రెడీ అయిపొండ్రి 🥳
We promise to bring back the typical Mass Maharaja on Big screens… pic.twitter.com/W7Q2Jdn6zO
— Sithara Entertainments (@SitharaEnts) April 9, 2024