Devil’s Double Next Level | తమిళ నటుడు సంతానం నటించిన ‘డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్’ (Devil’s Double Next Level) తెలుగు ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా మే 16న విడుదల కాబోతుండగా.. ‘డిల్లుకు దుడ్డు’ సిరీస్లో రాబోతున్న నాల్గవ చిత్రం, ఈ సినిమాకు ఎస్.ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా.. గౌతమ్ వాసుదేవ్ మీనన్, సెల్వరాఘవన్, గీతికా తివారీ, యషికా ఆనంద్, కస్తూరి శంకర్, నిజల్గల్ రవి, మారన్, రాజేంద్రన్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ నుంచి తెలుగు ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ట్రైలర్ చూస్తుంటే.. సినిమాకు రివ్యూలు ఇస్తూ వాటిని ఫ్లాప్ చేస్తుంటాడు సంతానం. అయితే సంతానం రివ్యూ వలన నష్టపోయిన ఒక వ్యక్తి దెయ్యం అయ్యి అతడిపై పగబట్టి.. ఒక లూప్లో పడేస్తాడు. అయితే ఆ లూప్లో చిక్కుకుపోయిన సంతానం మోట్ట రాజేంద్రన్ బయటకి ఎలా వచ్చారు అనేది ఈ సినిమా కథని తెలుస్తుంది. కామెడీ హారర్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆర్యా ‘ది షో పీపుల్’ మరియు వెంకట్ బోయనపల్లి ‘నిహారికా ఎంటర్టైన్మెంట్’ బ్యానర్లపై నిర్మించారు.