Devil Movie | రిజల్ట్ సంగతి పక్కన పెడితే కళ్యాణ్‌రామ్ ఎప్పుడు ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తుంటాడు. ప్రేక్షకులకు కొత్త తరహా కథలను చూపించాలని ఎప్పుడూ ఆరాటపడుతుంటాడు. అలా చేసిన ప్రమోగం ‘బింబిసార’ కళ్యాణ్ రామ్‌కు తిరుగులేని విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ జోష్‌తో ఇదే ఏడాది ప్రథమార్థంలో ‘అమిగోస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు ముందు జరిపిన హడావిడితో సినిమాపై ఎక్కడలేని బజ్ ఏర్పడింది. కానీ తీరా రిలీజయ్యాక డివైడ్ టాక్ తెచ్చుకుని పోస్టర్ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. అయితే ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై వీర లెవల్లో అంచనాలు నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ మ్యూజికల్ అప్డేట్ను ప్రకటించారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మాయే చేశావే ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వర పరిచిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఇక ఈ పాట ఫుల్ లిరికల్ వీడియోను సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే రిలీజైన టీజర్ జనాల్లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా డెవిల్ ముసుగేసుకుని బ్రిటీషర్ల కోసం కళ్యాణ్‌రామ్ ఎందుకు పని చేశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. లుక్స్ పరంగా కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో చాలా బాగున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
ఇక ఈ సినిమాకు నవీన్ మేడారం దర్శకత్వం వహించాడు. అయితే అనూహ్యంగా రీసెంట్గా రిలీజైన పోస్టర్లలో ఆయన పేరు కనిపిచండం లేదు. ఈ సినిమాకు దర్శకుడిగానూ అభిషేక్ నామా తన పేరే వేసుకున్నాడు. దీనిపై ట్విట్టర్లో పెద్ద చర్చలే జరుగుతున్నాయి.