Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Shiva) కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘దేవర'(Devara). ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇక ఈ సినిమాను మొదట ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సైఫ్ అలీఖాన్‌కు గాయం కావడంతో షూటింగ్ ఆలస్యం అయ్యి రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ సినిమాను 2024 అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీనితో పాటు కొత్త ఎన్టీఆర్ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
#Devara Part 1 releasing on 10.10.24. pic.twitter.com/AK4EvxQBz7
— Jr NTR (@tarak9999) February 16, 2024