Devara Movie | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘దేవర’.. రన్‌టైం ఎంతంటే.?
Devara Movie | యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara). జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి.
Devara Movie | యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara). జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది దేవర టీం. ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేయగా.. యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది.
ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు పూర్తిచేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు యూ/ఏ (U/A) సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్ల పాటు ఉండనుంది. ఇక మూవీలో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్ ఉంటుందని సెన్సార్ బోర్డ్ చెప్పినట్లు టాక్.
Also Read..
- Arvind Kejriwal | ఊరట దక్కేనా..? కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీంకోర్టు తీర్పు
- Kanchana 4 | రాఘవా లారెన్స్ కాంచన 4 స్క్రిప్ట్ ఫైనల్.. పూర్తి వివరాలివే..!
- Kaushik Reddy | నాలుగేండ్ల తర్వాత సినిమా చూపిస్తాం.. పార్టీ మారిన నేతలకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హెచ్చరిక
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

