Sakshi Vaidya | అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది మోడల్ సాక్షి వైద్య (Sakshi Vaidya). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఎంట్రీలోనే ఫ్లాప్‌ను మూటగట్టుకుంది సాక్షి వైద్య. అయితే ఫ్లాప్ సంగతి అటుంచితే ఆఫర్ల విషయంలో మాత్రం సాక్షివైద్య ఫుల్ బిజీగా ఉందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ భామ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ టైటిల్ రోల్ పోషిస్తున్న గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna)లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
బీవీఎస్ఎస్ ప్రసాద్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej)డెబ్యూ డైరెక్టర్ జయంత్‌తో చేస్తున్న సినిమాలో కూడా సాక్షివైద్యనే హీరోయిన్గా ఫైనల్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. ఈ మూవీ జులైలో షురూ కానుండగా.. ఈ చిత్రానికి కూడా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారని సమాచారం. ఇక మరోవైపు టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh).
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సాక్షి వైద్యను సెకండ్ హీరోయిన్గా ఎంపిక చేసినట్టు మరో వార్త కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది.
కెరీర్ తొలినాళ్లలోనే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో చేస్తున్న యాక్షన్ ప్యాక్డ్ కాప్ డ్రామాలో నటించే ఛాన్స్ కొట్టేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. మిగితా సినిమాల మాట అటుంచితే ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం మైల్స్టోన్ మూవీగా నిలువనుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు మూవీ లవర్స్.