Samantha | 14 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడికి.. ఆ సినిమాని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన సామ్
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) ప్రస్తుతం అమెరికా (America)లో సందడి చేస్తోంది. ఇటీవలే న్యూయార్క్ (New York ) నగరంలో జరిగిన వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ (India Day Parade)లో పాల్గొనేందుకు వెళ్లిన సామ్.. ప్రస్తుతం అక్కడ హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజా పర్యటనలో సామ్ తాను నటించి మొదటి చిత్రం ‘ఏమాయ చేశావే’ (Ye Maaya Chesave)ని గుర్తు చేసుకుంది.
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) ప్రస్తుతం అమెరికా (America)లో సందడి చేస్తోంది. ఇటీవలే న్యూయార్క్ (New York ) నగరంలో జరిగిన వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ (India Day Parade)లో పాల్గొనేందుకు వెళ్లిన సామ్.. ప్రస్తుతం అక్కడ హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఫేమస్ ప్లేసెస్‌ను విజిట్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటోంది. మంగళవారం ఉదయం సామ్ కొన్ని చీరకట్టు ఫొటోలను షేర్ చేసింది.ఆ ఫొటోల్లో బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ శారీలో సామ్ మెరిసిపోతూ కనిపించింది.
కాగా, తాజా పర్యటనలో సామ్ తాను నటించి మొదటి చిత్రం ‘ఏమాయ చేశావే’ (Ye Maaya Chesave)ని గుర్తు చేసుకుంది. తన తొలి చిత్రం షూటింగ్ న్యూయార్క్‌లోనే జరిగిందంటూ అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకుంది. ఈ మేరకు ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. న్యూయార్క్ నగరం కలల సాకారానికి అనువైన ప్రదేశంగా చెబుతుంటారని.. తన కెరీర్ కూడా ఇక్కడే ప్రారంభమైందని తెలిపింది. తాను నటించిన మొదటి చిత్రం (ఏమాయ చేశావే) షూటింగ్ ఇక్కడే జరిగిందని పేర్కొంది. అప్పుడు ఈ ప్రయాణం ఎలా ఉంటుందో తెలియక భయపడిన చిన్న పిల్లనని తెలిపింది. ఎంతో ధైర్యంతో అడుగులు ముందుకేశానని.. ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత అదే ప్రదేశానికి వచ్చి.. ఇండియా డే పరేడ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.
ఇక సామ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ఖుషీ (Kushi) రిలీజ్ కు సిద్దంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 1న గ్రాండ్ లెవల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనితో పాటుగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్ లో నటించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ లో సామ్ కాప్ గా కనిపించనుంది. ఈ సిరీస్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read..
Luna – 25 | లూనా-25 కూలిన గంటల వ్యవధిలోనే ఆసుపత్రి పాలైన రష్యన్ శాస్త్రవేత్త
Nuh violence | నూహ్‌లో ఎన్కౌంటర్.. మత ఘర్షణల నిందితుడి అరెస్ట్
IndiGo | రక్తం కక్కుకుని చనిపోయిన ప్రయాణికుడు.. ఇండిగో ఫ్లైట్‌లో ఘటన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

