Luna – 25 | లూనా-25 కూలిన గంటల వ్యవధిలోనే ఆసుపత్రి పాలైన రష్యన్ శాస్త్రవేత్త
Luna-25 | సుమారు ఐదు దశాబ్దాల తర్వాత చంద్రుడి (Moon)పైకి రష్యా (Russia) ఇటీవలే రాకెట్ ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. దక్షిణ ధ్రువమే లక్ష్యంగా ‘లునా - 25’ (Luna-25) అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. అయితే, లూనా-25 ల్యాండర్ అనూహ్యంగా విఫలమైంది. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన ప్రముఖ రష్యన్ శాస్త్రవేత్త లూనా కూలిన గంటల వ్యవధిలోనే ఆసుపత్రిపాలయ్యారు.
Luna-25 | సుమారు ఐదు దశాబ్దాల తర్వాత చంద్రుడి (Moon)పైకి రష్యా (Russia) ఇటీవలే రాకెట్ ప్రయోగం చేపట్టిన విషయం తెలిసిందే. దక్షిణ ధ్రువమే లక్ష్యంగా ‘లునా – 25’ (Luna-25) అనే స్పేస్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. అయితే, అంతరిక్ష రంగంలో పూర్వవైభవాన్ని పొందాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రయోగం మధ్యలోనే ఆవిరైపోయింది. లూనా-25 ల్యాండర్ అనూహ్యంగా విఫలమైంది. నిర్దేశిత సమయంలో ఆ మాడ్యూల్‌లోని ఇంజిన్లు ఆఫ్ కాకపోవడంతో లూనా-25 చంద్రుడిపై కుప్పకూలిపోయినట్లు రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ (Roscosmos) వెల్లడించింది. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన ప్రముఖ రష్యన్ శాస్త్రవేత్త లూనా కూలిన గంటల వ్యవధిలోనే ఆసుపత్రిపాలయ్యారు.
ఈ ప్రయోగంలో కీలకపాత్ర పోషించిన సీనియర్ శాస్త్రవేత్త 90 ఏళ్ల మిఖేయిల్ మారోవ్ (Mikhail Marov).. లూనా-25 కూలిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతనున్న చోటే కుప్పకూలిపోయారు. దీంతో మిఖేయిల్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను మాస్కోలోని క్రెమ్లిన్‌కు సమీపంలో ఉన్న సెంట్రల్ క్లినికల్ హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లూనా-25 వైఫల్యం పెద్ద ఎదురుదెబ్బ అని, అది తన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించిందన్నారు.
‘మాడ్యూల్‌ని చంద్రుడిపై ల్యాండ్ చేయడం సాధ్యం కాకపోవడం చాలా బాధాకరం. ఇలాంటిది జరిగినప్పుడు ఆందోళన చెందకుండా ఎలా ఉండగలను..? ఇది నా జీవితానికి సంబంధించిన అంశం.. చాలా క్లిష్టమైన సమయం. ప్రస్తుతం నేను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాను. రష్యా లూనార్ ప్రోగ్రామ్ పునరుద్ధరణపై నా చివరి ఆశలు ఆవిరైపోయాయి. లూనా-25 వైఫల్యం వెనుక ఉన్న కారణాలను నిశితంగా పరిశీలించి, విశ్లేషించాలని నేను ఆశిస్తున్నాను’ అని మిఖేయిల్ అన్నారు. కాగా, మిఖేయిల్ మారోవ్ గతంలో అనేక అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొని కీలక పాత్ర పోషించారు. ఆయన జీవితకాల కృషికి రూపమే లూనా-25 మిషన్.
Also Read..
Luna-25: లూనా-25 ఎందుకు కూలిందో చెప్పిన రష్యా
IndiGo | రక్తం కక్కుకుని చనిపోయిన ప్రయాణికుడు.. ఇండిగో ఫ్లైట్‌లో ఘటన
Sunny Deol | జుహు బంగ్లా వివాదంపై స్పందించిన సన్నీ డియోల్.. ఇంతకీ ఏమన్నారంటే..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

