Deepika Padukone | గత కొద్ది రోజులుగా దీపికా పదుకొణే పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది. అందుకు కారణం ఆమె స్పిరిట్ మూవీ నుండి తప్పుకోవడం. ఎప్పుడైతే దీపిక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందో వెంటనే తన సినిమా హీరోయిన్ తృప్తి డిమ్రీ అని సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. ఆ తర్వాత దీపికా విషయంలో బాగా హర్ట్ అయిన సందీప్ తన సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో దీపికా తన సోషల్ మీడియాలో మహిళలపై వివక్ష గురించి వీడియో షేర్ చేసింది.దీపిక పోస్ట్ చేసిన వీడియోను తమన్నా భాటియా లైక్ చేసి మద్దతు తెలిపారు. దీంతో ఈ ఇష్యూ చర్చనీయాంశం అయింది. ఇక దీపిక స్పిరిట్ నుండి తప్పుకోవడానికి పలు కారణాలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.
`స్పిరిట్` సినిమా కోసం రోజుకు ఆరు గంటల కంటే ఎక్కువ షూటింగ్ చేయనని దీపిక స్పష్టం చేసిందని, ఈ విషయంలోనే దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకి కోపం వచ్చి దీపికాని తప్పించినట్టు ప్రచారం జరిగింది. అంతేకాదు షూటింగ్ 100 రోజులకు మించితే, అదనపు రోజులకు అదనపు పారితోషికం ఇవ్వాలని దీపిక డిమాండ్ చేసినట్లు నెట్టింట ప్రచారం జరిగింది. ఈ షరతులు సందీప్ రెడ్డి వంగాకు ఇబ్బంది కలిగించాయని అన్నారు. అయితే తాజాగా దీపిక ఓ ఇంటర్వ్యూలో స్పిరిట్ నుండి తప్పుకోవడానికి గల కారణం చెప్పుకొచ్చింది.
రీసెంట్గా ఓ డైరెక్టర్ నన్ను కలిసి కథ చెప్పాడు. కథ చాలా బాగా నచ్చింది. కాని మనీ గురించి చర్చ వచ్చినప్పడు ఇంత చార్జ్ చేస్తా అని అన్నాను. దానికి వారు ఒప్పుకోలేదు. అందుకే నేను వారికి టాటా బైబై చెప్పాను. నా ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు. అందుకే ఆ సినిమాకి నేను ఒప్పుకోలేదని దీపిక స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు అట్లీ- అల్లు అర్జున్ సినిమాలో కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. దీపిక ఈ మధ్య కల్కి చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే.