Vishwak Sen | కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్!
“ఫలక్‌నుమా దాస్' చిత్రం కంటే ఈ సినిమా కోసం పదింతలు కష్టపడ్డా. నటనతో పాటు దర్శకత్వం ఇష్టంతో చేస్తాను. కానీ ప్రొడక్షన్ మాత్రం ఒత్తిడితో ఉంటుంది’ అన్నారు విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
“ఫలక్‌నుమా దాస్’ చిత్రం కంటే ఈ సినిమా కోసం పదింతలు కష్టపడ్డా. నటనతో పాటు దర్శకత్వం ఇష్టంతో చేస్తాను. కానీ ప్రొడక్షన్ మాత్రం ఒత్తిడితో ఉంటుంది’ అన్నారు విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి నా కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ లభించాయి. కామెడీ సినిమాలు తీయడం చాలా కష్టం. దర్శకుడిగా అది నా బలం కాదు. యాక్షన్ డార్క్ డ్రామా సినిమాలను నేను బాగా డైరెక్ట్ చేస్తా.
ఈ సినిమాలో కామెడీ కూడా బాగా తీశానని మెచ్చుకుంటున్నారు. ఫస్టాఫ్‌లో మంచి వినోదం పండిందని అంటున్నారు. ఈ సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేశా. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కథకు ఎవరూ న్యాయం చేయలేరని భావించి ఇంత డబ్బు పెట్టి సొంతంగా డైరెక్షన్ చేశా. సెకండాఫ్‌లో ట్విస్ట్‌లు ఉత్కంఠగా ఉన్నాయంటున్నారు.
ఈ సినిమా రెండో భాగం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం నాలుగు చిత్రాల్ని ఒప్పుకున్నా. అవి పూర్తయిన తర్వాతే ఫలక్‌నుమా దాస్-2, దాస్ కా ధమ్కీ-2 చిత్రాల దర్శకత్వం గురించి ఆలోచిస్తా. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా, రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఓ చిత్రం చేస్తున్నా. ఈ రెండింటి తర్వాత నా సొంత బ్యానర్లో సినిమా ఉంటుంది. ‘గామి’ విడుదలకు సిద్ధంగా ఉంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

