Dhandakadiyal Song Promo | మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం ఒక మాస్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘క్రాక్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ‘ఖిలాడీ’, ‘రామా రావు ఆన్ డ్యూటీ’లు వరుసగా ఫ్లాప్ అవడంతో రవితేజ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన ఆశలన్ని ‘ధమాకా’ సినిమాపైనే ఉన్నాయి. త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తున్నారు. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని ‘దండకడియాల్’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన ఫోర్త్ సింగిల్ ప్రోమో శ్రోతలను ఆకట్టుకుంటుంది. ఈ పాట ఫుల్ సాంగ్ త్వరలో రానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇది వరకే విడుదలైన జింతాక్, మాస్‌రాజా, వాట్స్ హప్పెనింగ్ సాంగ్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమా రవితేజ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో రూపొందింది. రవితేజకు జోడీగా పెళ్ళి సందడి ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందిస్తున్నాడు. భీమ్స్ సిసిరోలియో బాణీలు సమకూర్చాడు. నిజానికి ఈ చిత్రం దీపావళికే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.