Eagle | ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు రవితేజ (Ravi Teja). మాస్ మహారాజా కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో ఒకటి ఈగల్ (Eagle). సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈగల్ మూవీలో అనుపమపరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. కావ్య థాపర్ మరో కీలక పాత్రలో నటిస్తోంది.
విధ్వంసానికి కొత్త అర్థం.. ఇవాళ సాయత్రం 4:05 గంటలకు ఎక్జయిటింగ్ అప్డేట్ రాబోతుందని తెలియజేశారు మేకర్స్. ఈగల్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చేస్తారంటూ పుకార్లు తెరపైకి రాగా.. దీనిపై మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది. ఈగల్లో నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. Davzand సంగీతం అందిస్తున్నారు.
రవితేజ మరోవైపు పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటిస్తున్నాడు. 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా చలామణిలో ఉన్న టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ వంశీ (Vamsee) దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ మూవీతో నుపుర్ సనన్ హీరోయిన్గా టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది. గాయత్రి భరద్వాజ్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. సీనియర్ నటి రేణూదేశాయ్ హేమలత లవణం పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
అతనొస్తున్నాడు !! 🔥#EAGLE 🦅 has locked it’s course of destruction 🤘🏻
Massive upDATE LOADing Today at 4:05 PM 🔥@RaviTeja_offl @Karthik_gatta @vishwaprasadtg @vivekkuchibotla@anupamahere @KavyaThapar@davzandrockz @manibkaranam @sujithkolli @srinu10477@UrsVamsiShekar pic.twitter.com/kC9lDPROPL
— People Media Factory (@peoplemediafcy) September 27, 2023
ఈగల్ టైటిల్ అనౌన్స్ మెంట్..
#Eagle movie songs are going to be Feast 🤩 🦅
It’s Definitely Special 🕺@RaviTeja_offl@Karthik_gatta @manibkaranam @sujithkolli https://t.co/dc33g3DDZF— People Media Factory (@peoplemediafcy) August 27, 2023