గ్యాంగ్ స్టర్ నయీం (Gangster Nayeem) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం నయీం డైరీస్ (Nayeem Diaries). వశిష్ట ఎన్ సింహా (Vasishta N Simha) లీడ్ రోల్ పోషించగా..యజ్ఞా శెట్టి, సంయుక్తా హోర్నాడ్ కీ రోల్స్ పోషించారు. దాము బాలాజీ (Daamu Balaji) తెరకెక్కించిన సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలోని సన్నివేశాలు తెలంగాణ ఉద్యమకారిణి బెల్లి లలితను కించ పరిచేవిధంగా, ఆమె కుటుంబం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నయీం సినిమా విడుదల నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సినిమా నిర్మాత రాజు, డైరెక్టర్ దాము బాలాజీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు సినిమాలోని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద పలువురు ఉద్యమకారులు ఆందోళన నిర్వహించారు. సినిమా ఫ్లెక్సీ, పోస్టర్లను చించి, దహనం చేశారు. ఈ సినిమాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak | ‘భీమ్లానాయక్’లో పాటపాడిన దుర్గవ్వకు సన్మానం
Sara Ali Khan Heartfelt Note | సారా అలీఖాన్ భావోద్వేగ పోస్ట్..కారణమిదే
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?