పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ఆగస్ట్ 15న విడుదలైంది. ఇందులో పవన్ కళ్యాణ్ మాస్ అవతారంలో కనిపించి అలరించారు. లుంగలో పవన్ గెటప్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఇచ్చాడు థమన్.
అయితే పవన్ రౌడీలను కొడుతుంటే బ్యాగ్రౌండ్లో వస్తున్న మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. ఓ బిట్ దగ్గర ‘పెట్టా’ మూవీలోని ఓ పాట మ్యూజిక్‌ను ఇది పోలి ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్ చేయడంతో మళ్లీ థమన్పై కాపీ ఆరోపణలు వచ్చాయి. ఇలా మమ్మల్ని మోసం చేస్తూనే ఉంటావా అంటూ కొందరు నెటిజన్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. థమన్ మాత్రం అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు.
అయ్యప్పనుమ్ కోషియమ్’ అనే మలయాళ మూవీకి రీమేక్‌గా భీమ్లా నాయక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అక్కడ సూపర్ హిట్ సాధించిన ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, బీజుమేనన్లు ప్రధాన పాత్రల్లో నటించారు. బీజుమీనన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్, పృథ్వీరాజ్‌కుమార్ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నాడు. ఇక నిత్యామీనన్, ఐశ్వర్యా రాజేశ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం పవన్ అభిమానులకు పూనకం తెప్పించడం ఖాయం అంటున్నారు.
3