Coolie Movie | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. శనివారం కూలీ అన్లీష్డ్ అంటూ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్ చూస్తుంటే రజనీ ఇందులో దేవ అనే కూలీ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ చిత్రం టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రాబోతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేవ(రజనీకాంత్) ఫ్యూచర్లోకి వెళ్లి ఏం చేశాడు అనేది కథ అయ్యింటుందని తెలుస్తుంది. అలాగే సత్యరాజ్ టైమ్ మిషన్‌తో కసరత్తులు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇవన్ని చూస్తుంటే అసలు లోకేష్ ఏం ప్లాన్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Time Travel movie 👍🏻 #Coolie pic.twitter.com/gOy59BVzn6
— . (@shadow_star___) August 2, 2025