చలాకీ మాటలతో, తనదైన యాక్టింగ్ స్టైల్‌తో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది కలర్స్ స్వాతి. 2018లో పైలట్ వికాస్ వాసును వివాహం చేసుకున్న తర్వాత ఇండోనేషియాకు మకాం మార్చేసింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. ఈ బ్యూటీ ఎక్కువగా కనిపించకపోవడంతో ఆమె వ్యక్తిగత జీవితంపై పుకార్లు తెరపైకి వచ్చాయి. వాటన్నింటికి పుల్‌స్టాప్ పెడుతూ కలర్స్ స్వాతి ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.
న్యూ ఇన్నింగ్స్ లో చేస్తున్న తొలి చిత్రం ‘పంచతంత్రం’ సెట్స్ లో జాయిన్ అయింది స్వాతి. దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి లీక్ అవగా..నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పెండ్లి తర్వాత బొద్దుగా తయారైన స్వాతి..తాజా స్టిల్ లో మళ్లీ మునుపటిలా స్లిమ్ గా కనిపిస్తోంది. న్యూ కమర్ హర్ష పులిపాక డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్ కీరోల్స్ చేస్తున్నారు. అఖిలేశ్ వర్దన్, శృజన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చిరంజీవి సినిమాలో క్రేజీ బాలీవుడ్ స్టార్..!
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Recommended Content by ntnews.com