Cobra Movie | ‘ఆర్ఆర్ఆర్’ కంటే అధిక రన్‌టైంతో థియేటర్లలోకి ‘కోబ్రా’మూవీ?
Cobra Movie Run Time | చియాన్ విక్రమ్.. పేరుకు తమిళ హీరోనే అయినా తెలుగు హీరోలకు సమానంగా టాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్‌ను చూపిస్తూ విలక్షణ నటుడుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘కోబ్రా’ విడుదలకు సిద్ధంగా ఉంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా గతంలోనే షూటింగ్ పూర్తిచేసుకుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 31న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచగా.. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది.
ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సెన్సార్ యూఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. కాగా తాజాగా మేకర్స్ సినిమా రన్‌టైంను ప్రకటించారు. ఈ చిత్రం 3గంటల 3నిమిషాల 3 సెకన్ల రన్‌టైంతో థియేటర్లో విడుదల కానుంది. ఈ ఏడాది లాంగెస్ట్ రన్టైంగా ‘ఆర్ఆర్ఆర్'(3గంటల 2 నిమిషాలు)ను మించి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ ఈ చిత్రంలో మ్యాథమెటిక్స్ సైంటిస్టుగా నటించనున్నాడు. అంతేకాకుండా ఏడు విభిన్న గెటప్స్‌లో విక్రమ్ ఈ మూవీలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడీయోస్ బ్యానర్‌పై లలిత్ కుమార్ నిర్మించాడు. విక్రమ్‌కు జోడీగా కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. ప్రముఖ దిగ్గజ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.
Time for some number game!! 3:3:3 it is!! 🐍🐍 U/A #Cobra @chiyaan @arrahman @7screenstudio @RedGiantMovies_ @SrinidhiShetty7 @IrfanPathan @dop_harish @roshanmathew22 @mirnaliniravi #CobraFromAugust31 pic.twitter.com/oGeaIJVwV0
— Ajay R Gnanamuthu (@AjayGnanamuthu) August 27, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

