రాజకీయాల కంటే సినిమాకే తన తొలి ప్రాధాన్యత అని చెప్పింది అగ్ర కథానాయిక కంగనారనౌత్. రెండేళ్ల పొలిటికల్ కెరీర్ కంటే 20 ఏళ్ల సినీ ప్రస్థానమే తనకు ఎక్కువ గుర్తింపును తీసుకొచ్చిందని వ్యాఖ్యానించింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ‘నేను బీజేపీ పార్టీ విధానాల నుంచి పక్కకు వెళ్లాలని ఎప్పుడూ అనుకోను.
కానీ ఒకవేళ అలా జరిగితే నేను ఎవరి చేతిలో కీలుబొమ్మను కాదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. నేడు నాకు పార్టీ అండగా ఉంది. రేపు ఉండకపోవచ్చు. ఎంపీగా రెండేళ్ల రాజకీయం కంటే 20 ఏళ్ల నటప్రయాణమే నాకు ఎక్కువ పేరు తీసుకొచ్చింది. ఇప్పటికీ ఎంతో మంది దర్శకులు నాకోసం ఎదురుచూస్తున్నారు. సినిమాపరంగా ఇంకా చేయాల్సింది, సాధించాల్సింది చాలా ఉంది’ అని కంగనారనౌత్ పేర్కొన్నది.