ఒక్క యాక్షన్ సీన్లో కూడా డూప్ లేదు
దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ‘కాంతార చాప్టర్ 1’. దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా ‘కాంతార చాప్టర్ 1’. దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా స్టంట్ కొరియోగ్రాఫర్ అర్జున్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో ‘కాంతార చాప్టర్ 1’ గురించీ, నటుడు, దర్శక, నిర్మాత రిషబ్‌శెట్టి గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ‘ఇప్పటివరకూ చాలామంది హీరోలతో పనిచేశాను. కానీ రిషబ్‌శెట్టి లాంటి హీరోని మాత్రం నేను నిజంగా చూడలేదు. కష్టసాధ్యమైన ఫీట్ చేయాల్సొస్తే.. ఏ హీరో అయినా ‘నా శాయశక్తులా ప్రయత్నిస్తా..’ అంటాడు. కానీ రిషబ్ ‘నేను బతికున్నంత వరకూ చేస్తా..’ అంటాడు. ‘కాంతార చాప్టర్ 1’కోసం ఆయన తీసుకున్న రిస్క్ గురించి మాటల్లో చెప్పలేను. ఇందులో ఒక్క యాక్షన్ సన్నివేశంలో కూడా డూప్ ఉపయోగించలేదు. స్వయంగా రిషబే రిస్క్ చేసి చేశారు. ఇప్పటివరకూ ఆయన కెరీర్లో చేయని యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. నిజంగా ప్రాణాంతకమైన షాట్స్ అవన్నీ. వాటన్నింటినీ స్వయంగా చేశారు రిషబ్‌శెట్టి. దీనికోసం ప్రత్యేకంగా కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. ప్రాచీన యుద్ధకళగా ప్రాచుర్యం పొందిన కలరిపయట్టులోనూ శిక్షణ తీసుకున్నారు. నిజంగా ఎంతోమంది హీరోలకు స్ఫూర్తి రిషబ్ శెట్టి.’ అంటూ కొనియాడారు అర్జున్ రాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

