Thangalaan Movie Making Video | చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. నేరుగా తెలుగులో పలు సినిమాల్లో నటించిన విక్రమ్‌కు ‘అపరిచితుడు’ తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. అంతేకాకుండా విక్రమ్ మార్కెట్‌ను కూడా డబుల్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత విక్రమ్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయాయి. ఆయన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కు విక్రమ్ రీచ్ కాలేకపోయాడు. కాగా గతకొంత కాలంగా సరైన హిట్టు లేక నిరాశలో ఉన్న విక్రమ్‌కు పొన్నియన్ సెల్వన్ కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం అదే జోష్‌తో తంగలాన్ సినిమా పూర్తి చేస్తున్నాడు.
పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడేలేని అంచనాలు క్రియేట్ చేశాయి. సోమవారం విక్రమ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాలోని మేకింగ్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ వీడియోలో షూటింగ్ కోసం చిత్రబృందం ఎంతగా కష్టపడిందో.. ఎంతో పరిశోదన చేసిందో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. విక్రమ్ కూడా తన దేహాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. స్టైలిష్కు బ్రాండ్లా కనిపించే విక్రమ్ ఈ సినిమాలో డీ గ్లామరైజ్ పాత్రలో నటించాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం చాలా బరువు కూడా తగ్గినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా 19 శతాబ్ధంలోని కోలార్ గోల్డ్ ఫీల్స్ నేపథ్యంలో తెరకెక్కనుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాలో ఏకకాలంలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 3డీలో రూపొందిస్తున్నారని సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ను చిత్రబృందం తాజాగా వెల్లడించింది.జీవి. ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ పతాకంపై కే.ఈ జ్ఞానవేల్ రాజా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు నటిస్తున్నారు.