Chiyaan Vikram | ఆ సినిమాలో నటించలేదని రెండు నెలలు ఏడ్చాను : విక్రమ్
Thangalaan Movie | తమిళ స్టార్ నటుడు విక్రమ్ ప్రస్తుతం తంగలాన్ సక్సెస్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో అపరిచితుడు తర్వాత ఆ రేంజ్లో విక్రమ్‌కు హిట్ వచ్చిందంటే తంగలాన్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా తన ఫేవరేట్ దర్శకుడు మణిరత్నంతో సినిమా చేయలేదని రెండు నెలలు ఏడ్చినట్లు తెలిపాడు.
Thangalaan Movie | తమిళ స్టార్ నటుడు విక్రమ్ ప్రస్తుతం తంగలాన్ సక్సెస్‌తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో అపరిచితుడు తర్వాత ఆ రేంజ్లో విక్రమ్‌కు హిట్ వచ్చిందంటే తంగలాన్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా తన ఫేవరేట్ దర్శకుడు మణిరత్నంతో సినిమా చేయలేదని రెండు నెలలు ఏడ్చినట్లు తెలిపాడు.
మణిరత్నం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఫిల్మ్ మేకింగ్ నచ్చడంతో ఆయన తీసిన సినిమాలన్ని చూశాను. అయితే నా కెరీర్ మొదట్లో మణిరత్నంతో ఒక్క సినిమా అయిన చేయాలి అనుకున్న. అన్నట్లుగానే బొంబాయి ఆఫర్ వచ్చింది. బొంబాయిలో ఫస్ట్ నేనే హీరోని. ఆ సినిమా ఆడిషన్లో చేసిన ఒక చిన్న తప్పు వలన బొంబాయి సినిమాలో అవకాశం పోగొట్టుకున్నాను. ఆ మూవీ ఆడిషన్లో నన్ను స్టిల్ కెమెరా ముందు నటించమన్నాడు. నాకు అర్థం కాలేదు. వీడియో కెమెరా కాకుండా స్టిల్ కెమెరా తీసుకువచ్చి నటించమంటున్నాడు ఏంటి అనుకున్నాను. నేను యాక్ట్ చేయలేదు. అలా బొంబాయి అవకాశం చేజారింది. దీంతో ఆ బాధను తట్టుకోలేక రెండు నెలలు ఏడుస్తునే ఉన్నాను. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన విలన్‌తో పాటు పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటించాను. కానీ బొంబాయి వెలితి మాత్రం ఇంకా ఉంది అంటూ విక్రమ్ చెప్పుకోచ్చాడు.
తంగలాన్ విషయానికి వస్తే.. విక్రమ్, పా. రంజిత్ (Pa Ranjith) కాంబోలో వచ్చిన తాజా చిత్రం తంగలాన్ (Thangalaan). కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది అయితే ఈ సినిమాకు వచ్చిన సక్సెస్ పట్ల మూవీని హిందీలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తంగలాన్ హిందీ వెర్షన్‌ను సెప్టెంబర్ 06న విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా బాలీవుడ్లో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది.
Also read..
- Kangana Ranaut: జయాబచ్చన్ది అహంకారం: కంగనా రనౌత్
- BJP MLA Nitesh Rane | ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం.. బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణేపై కేసు
- MLA Madhavaram | మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా : ఎమ్మెల్యే మాధవరం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

