Chiru -Anil | మెగాస్టార్ చిరంజీవి కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన విశ్వంభర ఎప్పుడో విడుదల కావలసి ఉన్నా, వీఎఫ్ఎక్స్ వర్క్స్ వలన వాయిదా పడుతుందని అంటున్నారు. మల్లిడి వశిష్ఠ డైరెక్షన్లో, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సోషియో-ఫాంటసీ యాక్షన్ చిత్రంలో త్రిష కథానాయికగా నటించింది. కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో నటించారు. ఎప్పుడో ఈ చిత్రం విడుదల కావలసి ఉన్నా ఈ సినిమా టీజర్లో వీఎఫ్ఎక్స్ నాణ్యతపై విమర్శలు రావడంతో, చిరంజీవి కొత్త టీమ్‌ను తీసుకొచ్చి మూవీకి మెరుగులు దిద్దిస్తున్నట్టు తెలుస్తుంది.
విశ్వంభర సినిమా విడుదలను సెప్టెంబర్ 2025కి వాయిదా వేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు మూవీ జాడే లేదు. ఈ ఆలస్యం అభిమానులను నిరాశపరుస్తున్నప్పటికీ, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సినిమాను అందించాలని చిరంజీవి భావిస్తున్నారట. ఈ సినిమా బడ్జెట్ రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. మరోవైపు విశ్వంభర షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసిన చిరంజీవి ఇప్పుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఆల్రెడీ మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా ఫినిష్ చేసుకుందట ఈ మూవీ. ఈ స్పీడ్ చూస్తుంటే అనీల్ రావిపూడి అనుకున్న దాని కన్నా ముందే ప్యాకప్ చెప్పేలా ఉన్నాడుగా
రెండో షెడ్యూల్ ను కూడా రెడీ చేసేస్తున్నట్టు తెలుస్తుండగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సీనియర్ హీరో వెంకటేష్‌ని రూ.300 కోట్ల క్లబ్ చేర్చిన అనిల్ రావిపూడి మెగాస్టార్ ఎలా చూపిస్తాడోనని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలు నిండిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించడం ఖాయమైంది. దీంట్లో ఆయనది అతిథి పాత్రేం కాదని.. చాలా ప్రాధాన్యమున్న పాత్రని తెలిసింది. ఈ మూవీతో చిరు బడా హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు.