అగ్ర నటుడు చిరంజీవి మాస్, యాక్షన్ సినిమాలకు కాస్త బ్రేక్‌నిచ్చారు. తనదైన శైలి వింటేజ్ కామెడీతో ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం ద్వారా ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొని ఉంది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి చిరంజీవి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన సంప్రదాయ పంచెకట్టులో మెరిసిపోతున్నారు.
ట్రెడిషనల్ టచ్‌తో పాటు చిరంజీవి తనదైన స్వాగ్తో ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలి హాస్యం, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఇందులో వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నారని, బ్లాక్‌బస్టర్ హిట్ పక్కా అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థ: షైన్‌స్క్రీన్స్ అండ్ గోల్డ్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.