Chiranjeevi | టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి నుంచి రామ్ చరణ్, వైష్ణవ్ తేజ్ వరకు… అరడజనుకి పైగా మెగా హీరోలు తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. నిర్మాతలుగా కూడా మెగా కుటుంబ సభ్యులు అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ హీరోయిన్ల పరంగా చూస్తే మాత్రం నిహారిక ఒక్కరే కనిపించారు. ఆమె కూడా పెద్దగా నిలదొక్కుకోలేకపోయింది.అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మెగా డాటర్ నిహారిక కంటే ముందే మెగా ఫ్యామిలీ నుంచి ఒకరు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నించారు. ఆ విషయం మీకు తెలుసా?
చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత సినీ పరిశ్రమలోకి కాస్ట్యూమ్ డిజైనర్‌గా అడుగుపెట్టి, అనేక సినిమాలకు పని చేశారు. అనంతరం నిర్మాతగా మారి చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మించారు. అయితే నిర్మాతగా కాకుండా, సుస్మిత ఒకానొక సమయంలో హీరోయిన్గా రాణించాలనే ఆసక్తి చూపించారని సమాచారం. ఒక సినిమా కోసం నటనకు సిద్ధమయ్యారని, ఆ సినిమా పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో, ఉదయ్ కిరణ్ హీరోగా రూపొందగా, మొదటి భాగం షూటింగ్ కూడా పూర్తయిందట. కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చే సరికి కొన్ని అనివార్య కారణాలతో బ్రేక్ పడింది. సినిమా నిలిచిపోయింది. దాంతో సుస్మిత హీరోయిన్గా మారాలన్న ప్రయత్నం ఆగిపోయింది.
మెగాస్టార్ కూడా తన పెద్ద కూతురు సుస్మితాను హీరోయిన్ గా చూడాలని ఎన్నో కలలు కన్నారట. అలా ప్రయత్నాలు కూడా చేశారట. కాని ప్రతీ సారి ఏదో ఒక విధంగా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చేదని తెలుస్తోంది. ఇక మెగా హీరోయిన్గా మొదట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక పెళ్లి తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. ఇక విడాకుల అనంతరం మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతానికి యాక్టింగ్ పక్కన పెట్టి నిర్మాతగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. కమిటీ కుర్రాళ్లు అనే చిత్రాన్ని నిర్మించిన నిహారిక ఈ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది.