తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తల్లి కృష్ణ కుమారి (80) అనారోగ్యంతో బుధవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతితో తమిళిసై సౌందర్ రాజన్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బుధవారం ఆమె పార్థివ దేహాన్ని ప్రముఖుల సందర్శనార్ధం రాజ్ భవన్లో ఉంచగా, సాయంత్రం తమిళనాడు తీసుకువెళ్లారు. చెన్నైలోని సాలిగ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కృష్ణ కుమారి మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గవర్నర్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఫోన్లో తమిళిసైని పరామర్శించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలు స్టాలిన్, రంగస్వామి, కేంద్రమంత్రి కిషన్రెడ్డి గవర్నర్ను ఫోన్లో పరామర్శించారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా తమిళి సైకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మీ తల్లి మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అంటూ చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు.
Deeply saddened at the passing of your mother, Hon'ble @DrTamilisaiGuv . My hearty condolences and prayers to the family. May her soul rest in peace.
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 19, 2021