Pre Release Event | చెల్లెలి కోసం వస్తున్న చిరంజీవి.. గుడ్ లక్ కీర్తి సురేశ్..

Good Luck Sakhi Pre release Event | ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో ఏ ఫంక్షన్ జరిగినా కూడా దానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి వెళ్తున్నాడు. ఇండస్ట్రీ పెద్ద అవ్వకుండానే అన్ని వేడుకలకు పెద్దదిక్కు అవుతున్నాడు మెగాస్టార్. అయితే ఇండస్ట్రీలో చాలా మంది యువ దర్శక నిర్మాతలు చిరంజీవి ముఖ్య అతిథిగా పిలుచుకుంటే సినిమాకు పబ్లిసిటీతో పాటు ఆయన ఆశీర్వాదం కూడా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాల వరకు అందరూ చిరంజీవి దగ్గరికి వెళ్తున్నారు. ఆయన కూడా కాదనకుండా అన్ని వేడుకలకు వచ్చి తన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. తాజాగా కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నాడు.
జనవరి 28న థియేటర్స్‌లో విడుదల కానున్న గుడ్ లక్ సఖి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. జనవరి 26న హైదరాబాద్ పార్క్ హయత్ లో జరగనుంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నగేశ్ కుకునూర్ తెరకెక్కించాడు. గన్ షూటింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. బ్యాడ్ లక్ తప్ప గుడ్ అంటూ తెలియని ఒక అమ్మాయి కథ ఇది. ఇందులో పక్కా పల్లెటూరి అమ్మాయిగా నటించింది కీర్తి సురేశ్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకుంటుంది. ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కరోనా ఉన్న కూడా ధైర్యంగా ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి కూడా వస్తుండటంతో అంచనాలు మరింత పెరగడం ఖాయం.
మెహర్ రమేశ్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లిగా నటిస్తుంది కీర్తి సురేశ్. సిస్టర్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా తమిళ వేదాళం సినిమాకు రీమేక్. చిరంజీవితో రిలేషన్ కీర్తి సురేశ్‌కు ఇప్పుడు బలంగా ఉంది. అందుకే ఆన్ స్క్రీన్ చెల్లి కోసం ఇలాంటి పరిస్థితుల్లో కూడా బయటకు వస్తున్నాడు మెగాస్టార్. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం గమనార్హం.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
మన రాత మనమే రాసుకోవాల.. ఆకట్టుకుంటున్న గుడ్ లక్ సఖి ట్రైలర్
Keerthy Suresh: చెల్లెలు పాత్ర కోసం రెండు కోట్ల రెమ్యునరేషనా..!
Keerthy Suresh New Talent | కొత్త టాలెంట్ చూపించబోతున్న కీర్తిసురేశ్..!
Keerthy Suresh relaxing time | కీర్తిసురేశ్ ఎక్కడ రిలాక్స్ అవుతుందో చూడండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

