Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియనివారు ఉండరు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 60 ఏళ్ల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిరుకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తుంటారు. కూతుళ్లు, మనవరాళ్లతో సరదాగా సందడి చేస్తుంటారు. ముఖ్యంగా చిరుకి తన చిన్న కూతురు శ్రీజ అంటే చిన్నప్పటి నుంచి అమితమైన ప్రేమ. ఆమె ఏమడిగినా కాదనరు.
తాజాగా, తన ముద్దుల కూతురికి మెగాస్టార్ ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. శ్రీజ కోసం బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో ఓ విలాసవంతమైన ఇంటిని చిరు కొనుగోలు చేశారట. అన్ని సౌకర్యాలు ఉన్న ఆ ఇంటి విలువ అక్షరాల రూ.35 కోట్లని సమాచారం. ఈ ఇంటిని చిరు తన సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌తో కొన్నారట.
ప్రస్తుతం చిరంజీవి..‘వాల్తేరు వీరయ్య’, ‘భోళా శంకర్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ ఈ సంక్రాంతికి సందడి చేయబోతోంది. జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి యూనియన్ లీడర్‌గా కనిపించనున్నట్లు టాక్. చిరకు జోడీగా శృతి హాసన్ నటిస్తోంది. రవితేజ పోలీస్ అధికారిగా కీలకపాత్ర పోషిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.