మళ్లీ హద్దు మీరిన చైనా!
ఒక చైనా సైనిక విమానం ఈ నెల 12న సిక్కింలోని భారత గగనతలంలోకి చొరబడి 20-25 నిమిషాల పాటు చక్కర్లు కొట్టిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
- భారత గగనతలంలోకి చైనా సైనిక విమానం చొరబాటు
- 20-25 నిమిషాల పాటు సిక్కిం భూభాగంపై చక్కర్లు
న్యూఢిల్లీ: ఒక చైనా సైనిక విమానం ఈ నెల 12న సిక్కింలోని భారత గగనతలంలోకి చొరబడి 20-25 నిమిషాల పాటు చక్కర్లు కొట్టిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ ప్రాంతం భారత భూభాగంలోని అత్యంత సున్నితమైన భాగాలలో ఒకటైన ‘సిలిగురి కారిడార్’కు అభిముఖంగా ఉండడంతో ఈ పరిణామం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈనెల 12న ఉదయం 8 గంటల సమయంలో చైనా విమానం కదలికలను భారత వైమానిక దళం పసిగట్టిందని, తమ భూభాగంలోకి తిరిగి వెళ్లాలని పదేపదే హెచ్చరికలు జారీ చేసిందని ఆ వర్గాలు తెలిపాయి. 25 వేల అడుగుల ఎత్తులో ఈ విమానం కదలికలను గుర్తించినట్టు పేర్కొన్నాయి.
సిలిగురి కారిడార్ ప్రాముఖ్యత
సిలిగురి కారిడార్ పశ్చిమ బెంగాల్‌లోని ఒక సన్నని భూభాగం. ఇది అత్యంత సన్నగా ఉన్న చోట సుమారు 20-22 కిలోమీటర్ల వెడల్పుతో ఉండి, ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది. దీనిని చికెన్స్ నెక్ అని కూడా పిలుస్తారు. ఇది చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లకు సమీపంలో ఉన్నందున దీనిపై జరిగే ఏ సాధారణ సైనిక కార్యకలాపమైనా భద్రతా ప్రణాళికల అధికారుల దృష్టిని తక్షణం ఆకర్షిస్తుంది. చైనాకు చెందిన టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతంతో సరిహద్దును సిక్కిం పంచుకుంటుంది. డోక్లామ్ పీఠభూమికి ఇది సమీపంలో ఉంటుంది.
గత అనుభవాలు
చైనా సైనిక విమానాలు సరిహద్దు వెంబడి ఆందోళన కలిగించడం ఇది మొదటిసారి కాదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్న సమయాల్లో ఇలాంటి ఘటనలు పలుమార్లు చోటుచేసుకున్నాయి. 2022 జూన్‌లో ఒక చైనా సైనిక విమానం తూర్పు లద్దాఖ్‌లో భారత సైనిక స్థావరాలకు అత్యంత సమీపం నుంచి ప్రయాణించింది. భూతల సిబ్బంది, భారత రాడార్లు దానిని గుర్తించగా ఐఏఎఫ్ ప్రతిస్పందన అధికార యంత్రాంగాన్ని క్రియాశీలం చేసింది. భారత్ ఈ విషయాన్ని చైనాతో సైనిక మార్గాల ద్వారా ప్రస్తావించింది.
2020లో తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభన సమయంలో చైనా సైనిక హెలికాప్టర్లు వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)కు సమీపంలో సంచరిస్తూ కనిపించాయి. ఆ ప్రాంతంలో ఎలాంటి చొరబాటునైనా అడ్డుకోవడానికి ఐఏఎఫ్ యుద్ధ విమానాలను దింపింది. ఆ హెలికాప్టర్లు భారత గగనతలంలోకి ప్రవేశించలేదని అధికారులు తెలిపారు. 2017 అక్టోబర్ 11న ఉత్తరాఖండ్‌లోని బరాహోటి ప్రాంతంలో రెండు చైనీస్ హెలికాప్టర్లు చొరబడినట్టు సమాచారం. ఈనెల 7న నాలుగు చైనా హెలికాప్టర్లు లద్దాఖ్‌లోకి చొరబడ్డాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

