మందమర్రి నేపథ్యంలో
‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో రాబోతున్న అడ్వెంచరస్ మూవీ ‘చంద్రయాన్'. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేశ్, బలగం సత్యనారాయణ కీలక పాత్రలుపోషించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకుడు.
‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత దర్శకుడు వేణు ఊడుగుల సమర్పణలో రాబోతున్న అడ్వెంచరస్ మూవీ ‘చంద్రయాన్’. శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేశ్, బలగం సత్యనారాయణ కీలక పాత్రలుపోషించిన ఈ చిత్రానికి శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకుడు. ప్రవీణ్ మొలక నిర్మాత. నవంబర్ 13న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో ‘చంద్రయాన్’ సినిమా రాకెట్‌ని రివీల్ చేస్తూ ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. దర్శకుడు సంకల్ప్‌రెడ్డి ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
‘టీమంతా ప్రాణంపెట్టి పనిచేశారు. కూతురి పెళ్లి చేసినంత ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. డైరెక్టర్ శ్రీనాథ్ మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఇన్నోసెన్స్ ఉన్న సినిమా ఇది. ఇందులో లాజిక్స్ ఉండవు. ‘చంద్రయాన్’ భారత్ సత్తాను ప్రపంచానికి ఎలాగైతే చాటిందో, ఈ ‘చంద్రయాన్’ టీమ్ ప్రతిభను ఇండస్ట్రీకి చాటుతుంది’ అంటూ నమ్మకంగా చెప్పారు. ‘ఊరిజనాల్లో ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేని నలుగురు కుర్రాళ్లు రాకెట్ తయారు చేసి చంద్రునిపైకి వెళ్లాలని డిసైడ్ అవుతారు. మరి వారు అనుకున్నది సాధించారా? మందమర్రి టు చందమామ అంటూ సాగిన వీరి ప్రయాణ హంగామా ఎలా సాగింది?అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా’ అని దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ చెప్పారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

