శివ కందుకూరి హీరోగా రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘చాయ్ వాలా’. ప్రమోద్ హర్ష దర్శకుడు. రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్.పాపుడిప్పు నిర్మాతలు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘నా చాయ్ విలువ రూ.15.. అంతకన్నా ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా.. నా విలువ పడిపోతుంది..’ అంటూ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్‌తో టీజర్ మొదలైంది.
తండ్రీ కొడుకుల మధ్య సీన్లు, లవ్ ట్రాక్.. ఇవన్నీ టీజర్లో కనిపిస్తున్నాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు ఎమోషన్‌తో బయటకు వస్తాడని నిర్మాత రాజ్ కందుకూరి చెప్పారు. ఈ సినిమా చూసిన ఎవరికైనా తన తండ్రితో కాసేపు మాట్లాడాలనిపిస్తుందని హీరో శివ కందుకూరి అన్నారు. ప్రతి మనిషి జీవితంలోని సంఘటనలే ఇందులోనూ ఉంటాయని దర్శకుడు తెలిపారు. .