రామ్‌చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించనున్న ‘ఆర్సీ 16’(వర్కింగ్ టైటిల్)కు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా ఊపందుకుంది. క్రీడా నేపథ్యంతో సాగే కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువకునిగా శక్తిమంతమైన పాత్రలో రామ్‌చరణ్ కనిపించనున్నారు.
రష్మిక మందన్నా కథానాయికగా ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. రియల్‌లైఫ్ సంఘటనల ఆధారంగా బుచ్చిబాబు ఈ కథ తయారు చేసుకున్నట్టు సమాచారం. ‘ఉప్పెన’ తర్వాత ఆయన తెరకెక్కించనున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు కొత్తవాళ్లను పరిచయం చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ఆడిషన్స్ నిర్వహించనున్నట్టు ప్రకటన కూడా విడుదల చేశారు. మైత్రీ మూవీమేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మించనున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు.