మోహన్ బాబుపై పోలీస్ కేసు.. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తమను అవమానించారని రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకం సంఘం నేతల ఫిర్యాదు మేరకు మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ.. మోహన్ బాబును వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మీడియా ముందు క్షమాపణలు చెప్పాలని.. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. మా అసోసియేషన్ ఎన్నికలు పూర్తయిన తర్వాత మోహన్ బాబు ఎక్కువగా మీడియా ముందు కనిపిస్తున్నాడు. ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని విషయాలపై ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు గొడవపడి బయట వాళ్ల ముందు చులకన కావద్దంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపైనా మోహన్ బాబు సెటైర్లు వేశాడు. మైకు దొరికింది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు ఈ మధ్య ఒక కార్యక్రమానికి హాజరైన కలెక్షన్ కింగ్.. ఇండస్ట్రీలో జరిగిన గొడవలు గురించి ఓపెన్ అయ్యాడు. ఇష్టం వచ్చినట్లు గొడవ పడితే అది చూడటానికి అస్సలు బాగోదు.. ఈరోజుల్లో గొర్రెలు కాచుకునే వారి దగ్గర కూడా ఫోన్ ఉంది.. వాడు కూడా మన బాగోతం చూస్తున్నాడు అంటూ కామెంట్ చేశాడు మోహన్ బాబు. ఇప్పుడు ఇదే వివాదాస్పదమైంది.
గొర్రెల కాపరి వృత్తిని అవమానించేలా మాట్లాడాడు అంటూ మోహన్ బాబుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక పోలీస్ స్టేషన్లో గొర్రెలు, మేకలు పెంపక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన వాళ్లు.. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Rashmika Mandanna |ఆ క్రెడిట్ సోషల్‌మీడియా కుటుంబానిదే: రష్మిక
Defamation case: షెర్లిన్ చోప్రాపై 50 కోట్ల పరువునష్టం దావా వేసిన శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా
ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ వస్తే ఆర్.నారాయణమూర్తి ఎందుకు రిజెక్ట్ చేశాడు?
ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సినిమాకు 20 ఏళ్లు.. సాధించిన రికార్డులు ఇవే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

