Uorfi Javed | నకిలీ అరెస్ట్ వీడియో.. ఉర్ఫీ జావేద్‌పై కేసు నమోదు
Uorfi Javed | ఉర్ఫీ జావేద్ (Uorfi Javed).. పరిచయం అక్కర్లేని పేరు. వింత డ్రెస్సులు, విచిత్ర వేషధారణతో నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. తాజాగా ఈ సోషల్ మీడియా స్టార్ ఓ వీడియో పోస్టు చేసి చిక్కుల్లో పడింది. ఏకంగా ముంబై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.
Uorfi Javed | ఉర్ఫీ జావేద్ (Uorfi Javed).. పరిచయం అక్కర్లేని పేరు. వింత డ్రెస్సులు, విచిత్ర వేషధారణతో నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది. తాజాగా ఈ సోషల్ మీడియా స్టార్ ఓ వీడియో పోస్టు చేసి చిక్కుల్లో పడింది. ఏకంగా ముంబై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే..?
ఉర్ఫీ జావేద్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ఓ కేఫ్‌లో ఉర్ఫీని ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు ఉంది. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు..? అని ఉర్ఫీ ప్రశ్నించగా.. ‘ఇంత చిన్న చిన్న బట్టలు వేసుకుని ఎవరైనా తిరుగుతారా..?’ అంటూ పోలీసులు సమాధానమిస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది. నెటిజన్లు దీనికే అరెస్ట్ చేస్తారా..? అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. దీనిపై ముంబై పోలీసులు స్పందించడంతో చివరికి వీడియో వెనుక ఉన్న అసలు నిజం బైటపడింది. అది ఫేక్ వీడియో అని తేలింది (creating fake video). అందులో ఉన్న పోలీసులు కూడా ఫేక్ అని స్పష్టమైంది.
మరోవైపు ఈ ఘటనకు ముంబై పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉర్ఫీతోపాటు, వీడియోలో ఉన్న వారిపై క్రిమినల్ కేసులు బుక్ చేశారు. పబ్లిసిటీ కోసం ఇలా చట్టంతో ఆటలాడటం మంచిదికాదని అన్నారు. ఈ వీడియోలో పోలీస్ యూనిఫాం, సింబల్స్‌ను దుర్వినియోగపరిచినందుకు గానూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. వారిపై ఓషివారా పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్ 171, 419, 500, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read..
Aamir Khan | అమీర్ ఖాన్ ఇంట పెళ్లి సందడి.. ఐరా-నిపుర్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ
Vasundhara Raje | ఇక రిటైర్మెంట్ తీసుకోవాలనిపిస్తోంది.. రాజస్థాన్ మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
Heavy rain | చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం.. విద్యాసంస్థలకు సెలవు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

