Saint Von Colucci | ప్రముఖ కెనడియన్ యాక్టర్ సెయింట్ వాన్ కోలుసి (22) కన్ను మూశాడు. సుదీర్ఘమైన కెరీర్ ఉన్న సెయింట్ వాన్ కోలుచి అర్థాంతరంగా లోకాన్ని వదిలివెళ్లడం హాలీవుడ్ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. సెయింట్ వాన్ ఆకస్మిక మృతికి అతడు చేయించుకున్న సర్జీలే కారణమని కథనాల సారాంశం.
మీడియా కథనాల ప్రకారం పాపులర్ కొరియన్ పాప్ సింగర్ కమ్ డ్యాన్సర్ జిమిన్ (BTS vocalist Jimin)లా కనిపించేందుకు సెయింట్ వాన్ సుమారు 12 రకాల సర్జరీలు చేయించుకున్నాడు. అయితే సర్జరీ కారణంగా ఏర్పడిన ఇన్ఫెక్షన్ కారణంగా ప్రాణాలు వదిలినట్టు సమాచారం. ముఖం, ముక్కు, కన్ను సహా ఇతర 12 రకాల సర్జరీల కోసం సెయింట్ వాన్ 22000 యూఎస్ డాలర్లు ( రూ.2 కోట్లు) ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.
సర్జరీలో భాగంగా దవడకు అమర్చిన ఇంప్లాంట్స్ తొలగించేందుకు శనివారం మరో సర్జరీ కూడా చేయించుకోగా.. ఇన్ఫెక్షన్ సోకడంతో ప్రాణాల మీదికొచ్చినట్టు ఓ అంతర్జాతీయ మీడియా తన కథనంలో రాసుకొచ్చింది. సెయింట్ వాన్ కొరియన్ పాప్ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంగా 2019లో కెనడా నుంచి సౌత్ కొరియాకు వెళ్లినట్టు అతని సన్నిహితులు వెల్లడించారు.
Jailer | రజినీకాంత్ జైలర్ రిలీజ్ టైం ఫిక్సయినట్టే..
Agent | ఏజెంట్ నుంచి ఊర్వశి రౌటేలా వైల్డ్ సాలా వీడియో సాంగ్