సన్నీ, నవీన్, రోహిణి రేచల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘జైత్ర’. తోట మల్లికార్జున్ దర్శకుడు. అల్లం సుభాష్ నిర్మాత. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణనంతర పనులను జరుపుకుంటోంది. ఇటీవల ఈ చిత్రలోని సెకండ్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘రాయలసీమ స్లాంగ్, నేటివిటీతో రూపొందుతున్న చిత్రం ఇది. ఇప్పటి వరకు రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ సినిమాలు తీశారు. మొదటిసారి ఒక రైతు కథతో చాలా సహజంగా ఈ చిత్రాన్ని రూపొందించాం’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఫణికల్యాణ్.