అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బుట్ట బొమ్మ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం నుంచి ‘పేరు లేని ఊరులోకి..’ అనే పాటను విడుదల చేశారు. సనాపతి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యాన్ని అందించిన ఈ పాటను స్వీకర్ అగస్తి స్వరపర్చగా..మోహన భోగరాజు పాడారు. చిన్న చిన్న విషయాల్లో ఆనందాన్ని వెతుక్కునే సత్య అనే అందమైన అమ్మాయి ప్రేమ కథ ఇది. ఆహ్లాదకర గ్రామీణ వాతావరణంలో రూపొందించిన ఈ పాట సినిమాకు ఆకర్షణ అవుతుందని చిత్రబృందం చెబుతున్నారు. నవ్య స్వామి, నర్రా శీను, పమ్మి సాయి, వాసు ఇంటూరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.