Surya Vashistta | త్రివిక్రమ్ గైడెన్స్ వల్లే బుట్టబొమ్మలో నటించా.. సూర్య వశిష్ట చిట్‌చాట్
అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). సూర్య వశిష్ట ,అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సూర్య వశిష్ట మీడియాతో చిట్ చాట్ చేశాడు.
అనిఖా సురేంద్రన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ (Butta Bomma). సూర్య వశిష్ట ,అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేశ్ (Shourie Chandrasekhar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సూర్య వశిష్ట మీడియాతో చిట్ చాట్ చేశాడు. సినిమా విశేషాలు సూర్య వశిష్ట (Surya Vashistta) మాటల్లోనే..
ఫిలిం ఇండస్ట్రీకి ఎలా ఎంట్రీ ఇచ్చారు..?
రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్ట్ చేసిన చాలా సినిమాలకు మా నాన్న (చనిపోయారు) కో డైరెక్టర్‌గా పనిచేశారు. నన్ను నటుడిలా చూడాలని అనుకునేవారు. నేను సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్న సమయంలో నాన్న నన్ను యూఎస్ నుంచి ఇండియా తిరిగి వచ్చేయమన్నారు. నాన్న ధృడ సంకల్పం, త్రివిక్రమ్ సార్ గైడెన్స్ తో బుట్టబొమ్మలో ఎంపికయ్యా.
బుట్టబొమ్మ గురించి..
ఒరిజినల్ వెర్షన్ కప్పెల మూవీకి బుట్టబొమ్మకు చాలా తేడా ఉంటుంది. ప్రత్యేకించి మురళికి సంబంధించిన సన్నివేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. బుట్టబొమ్మ పూర్తిగా ఫ్రెష్ ఫీల్ అందించేలా సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో మాత్రం కొన్ని సారుప్యతలు కనిపిస్తాయి.
ఈ రీమేక్‌ను ప్రేక్షకులు చూస్తారనుకుంటున్నారా..?
ఒరిజినల్ వెర్షన్‌ను చాలా మంది చూసినప్పటికీ, బుట్టబొమ్మ అందరికీ చెప్పాల్సిన చాలా ముఖ్యమైన కథ అని నా భావన. కేరళ కన్నా ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది. మన నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేయడం జరిగింది. ప్రేక్షకులు ఖచ్చితంగా బుట్టబొమ్మను ఇష్టపడతారు.
అనిఖా, అర్జున్‌తో పనిచేయడం ఎలా ఉంది..?
ఇద్దరితో పనిచేయడం చాలా సరదాగా అనిపించింది. అనిఖా సురేంద్రన్ టాలీవుడ్‌కు కొత్త. అందుకే డైలాగ్స్ విషయంలో ఆమెకు సాయం చేశా. ఆమె స్వీట్ హార్ట్ మాత్రమే కాదు మంచి కోస్టార్. అర్జున్ సౌత్‌లో మంచి స్టార్ యాక్టర్. యాక్షన్ సన్నివేశాల్లో నన్ను గైడ్ చేశారు.
డైరెక్టర్ రమేశ్ గురించి..
మా దర్శకుడు రమేశ్‌తో పనిచేయడం సవాలుతో కూడుకున్నది. మా నుంచి ఏం కావాలో అది రాబట్టుకునే వరకు విశ్రాంతి తీసుకోరు. టాలీవుడ్లో ఆయనకు గొప్ప భవిష్యత్ ఉంది.
మీ కొత్త సినిమాల మాటేంటి..?
నేను 6-7 కథలు విన్నాను. కానీ ఏ ఒక్కటి ఇంకా ఒకే చేయలేదు. యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడమంటే ఇష్టం. ఆ పాత్రల్లో నేను బాగా సూట్ అవుతా. ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌కు సంతకం చేస్తే మీ అందరికీ అప్డేట్ ఇస్తా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్‌లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

