అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రం నేడు అన్ని థియేటర్స్‌లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ట్రైలర్లో బన్నీ తన విశ్వరూపం చూపించడంతో చిత్రంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇందులో బన్నీ తన నట విశ్వరూపం చూపించాడు. లారీ డ్రైవర్‌గా ఊర మాస్ పాత్రలో ఇరగదీశాడు.
యాక్షన్ సన్నివేశాలతో తగ్గేదేలే అన్నట్టుగా ఉంది పుష్ప చిత్రం. భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి, సాయి ధరమ్ తేజ్ నిన్న పుష్ప చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేయగా, ఈ రోజు ఉదయం రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్, సుకుమార్ , రష్మికలను పొగడ్తలతో ముంచేసారు.
సుకుమార్ గారు మీ కృషి అసమానమైనది అని అన్నారు. మీ విజన్ మనసుకు హత్తుకునేలా ఉంది. విడుదల కోసం ఎదురు చూస్తున్న రష్మిక మందన్న కి మరియు పుష్ప టీమ్ కి ఆల్ ది బెస్ట్ అని అన్నారు. చరణ్ ట్వీట్‌కి స్పందించిన అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలియజేశాడు.