Bro Movie Promotions | సరిగ్గా పదహారు రోజుల్లో ఈ పాటికి బ్రో సందడి షురూ అయిపోతుంది. పవన్ ఫ్యాన్స్ భారీ కటౌట్లతో పేరుకు రీమేక్ సినిమానే అయినా.. పోస్టర్లు, టీజర్లు గట్రా చూస్తుంటే చాలా మార్పులే చేసినట్లు తెలుస్తుంది. ఇక తొలిసారి పవన్, సాయిధరమ్ తేజ్ ఒకేసారి స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పి. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో బిజీగా గడిపేస్తున్నారు.
తాజాగా చిత్రబృందం గోదావరి నదిలో బోట్లతో సినిమా టైటిల్‌ను ప్రజెంట్ చేశారు. ఇలా వినూత్నంగా ప్రమోషన్లతో జనాల్లో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే టీజర్ సహా మై డియర్ మార్కండేయా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పీపుల్ మీడియా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయిధరమ్‌కు జోడీగా కేతిక శర్మ నటిస్తుంది.
ఇక బ్రో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు భారీ రేంజ్లో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ వంద కోట్లు దాటిందని తెలుస్తుంది. ఒక్క ఆంధ్ర ఏరియాలోనే దాదాపు రూ.40 కోట్ల రేంజ్లో బిజినెస్ జరుగిందట. అది కూడా సీడెడ్ కాకుండా. ఇక ఓవర్సీస్లో రూ.13 కోట్లు డీలింగ్ ఇప్పటికే ఫిక్సయిపోయిందట. నైజాం, సీడెడ్ సహా మిగిలిన ఏరియాలు అన్ని కలుపుకుని మొత్తంగా వంద కోట్ల నెంబర్ అయితే దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఒక రీమేక్ సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరుగుతుందంటే పవన్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
#BroTheAvatar #BROon28thJuly https://t.co/98obGrvXpw
— Vishwa Prasad (@vishwaprasadtg) July 11, 2023