Brahmastra | ఓటీటీలోకి వచ్చేసిన ‘బ్రహ్మస్త్ర’.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?
Brahmastra On OTT | బాలీవుడ్ కపుల్ రణ్‌బీర్, అలియా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'బ్రహ్మస్త్ర'. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో 'బ్రహ్మస్త్రం' పేరుతో రాజమౌళి రిలీజ్ చేశాడు.
Brahmastra On OTT | బాలీవుడ్ కపుల్ రణ్‌బీర్, అలియా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో రాజమౌళి రిలీజ్ చేశాడు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 9న రిలీజైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. చాలా కాలం తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. నాగార్జున కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగులో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫైనల్‌గా ఈ చిత్రం దాదాపు రూ.400 కోట్ల వరకు వసూళ్ళను సాధించింది. కాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రం గత రాత్రి నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీతో పాటు అన్ని భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది. మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా రూపొందనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో రిలీజైంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో మౌనీరాయ్ విలన్ పాత్రలో నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

