టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ లూసిఫర్ తెలుగు రీమేక్ (Lucifer Remake)లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహించనున్న ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే షురూ అయింది. అయితే ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్ పోషించిన పాత్రను చిరంజీవి చేస్తోండగా.. పృథ్విరాజ్ సుకుమారన్ చేసిన పాత్ర కోసం యాక్టర్ ను ఎంపిక చేసే పనిలో ఉంది టీం. దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి అటు బీటౌన్ లో, ఇటు సౌత్‌లో చక్కర్లు కొడుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)ను పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర కోసం చిరంజీవి అండ్ టీం సంప్రదించగా..సల్లూభాయ్ ఆ ఆఫర్ నో చెప్పాడన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్‌ఖాన్, చిరంజీవి మంచి స్నేహితులు. రాంచరణ్ కూడా సల్మాన్ ఖాన్ కు క్లోజ్ గా ఉంటాడు. అయితే పృథ్విరాజ్ సుకుమార్ పాత్ర నిడివి 5 నిమిషాలే అయినా సినిమా చివరి వరకు ఆ పాత్ర ట్రావెలింగ్ అవుతుంది. ప్రస్తుతం ఇదే పాత్ర కోసం సల్మాన్ అంతగా ఆసక్తి చూపించలేదని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్న సల్మాన్ ఖాన్ మరి లూసిఫర్ ప్రాజెక్టులో జాయిన్ అవుతాడా..? లేదా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరోవైపు స్టార్ హీరో ఛియాన్ విక్రమ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ రోల్ కు సంబంధించిన చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇవికూడా చదవండి..
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!