Awarapan 2 | బాలీవుడ్ క్లాసిక్ ‘ఆవారాపన్’కి సీక్వెల్.. ఆకట్టుకుంటున్న టీజర్!
Awarapan2 | బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన క్లాసిక్ యాక్షన్-డ్రామా 'ఆవారాపన్' (2007) సీక్వెల్ రాబోతుంది.
Awarapan2 | బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన క్లాసిక్ యాక్షన్-డ్రామా ‘ఆవారాపన్’ (2007)కి సీక్వెల్ రాబోతుంది. ఇమ్రాన్ హష్మీ కెరీర్లోనే మైల్‌స్టోన్‌గా నిలిచిన ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తుండగా తాజాగా ఈ సినిమా విడుదల తేదీతో పాటు టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. దాదాపు 19 సంవత్సరాల తర్వాత ‘శివం’ పాత్రలో ఇమ్రాన్ హష్మీ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తీవ్రమైన దుఃఖం, గతాన్ని తలచుకుంటూ గుండె నిండా బాధతో, తన జీవితానికి ఒక అర్ధాన్ని వెతుక్కునే వ్యక్తిగా శివం పాత్రను ఈ టీజర్లో అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా “ఇస్ బార్ యే ఆవారాపన్ ఖతమ్ హోగా, యా మైన్” (ఈసారి ఈ ఆవారాపన్ ముగుస్తుంది, లేదా నేను) అంటూ ఇమ్రాన్ హష్మీ చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది.
విశేష్ ఫిల్మ్స్, ముఖేష్ భట్ సమర్పణలో విశేష్ భట్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సీక్వెల్లో ఇమ్రాన్ హష్మీ సరసన దిశా పటాని కీలక పాత్రలో నటిస్తుండగా, సీనియర్ నటి షబానా అజ్మీ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. సోనీ మ్యూజిక్ సంస్థ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, పెన్ మరుధర్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ పంపిణీ బాధ్యతలను చేపట్టింది. ఒరిజినల్ సినిమాలోని ‘తో ఫిర్ ఆవో’ వంటి ఐకానిక్ పాటతో పాటు సరికొత్త మ్యూజిక్‌ను అందించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ క్రేజీ సీక్వెల్ 2026 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

