Urvashi Rautela | అమ్మో ! ఊర్వశి రౌతెలా వేసుకున్న మొసలి నెక్లెస్ అన్ని వందల కోట్లు ఉంటుందా?
Urvashi Rautela | ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ తారలు హొయలు పోతున్నారు. విభిన్నమైన డ్రెస్సులు, అలంకరణలతో ఆకట్టుకుంటున్నారు. వీరిలో అందరికంటే ఎక్కువగా ఊర్వశి రౌతెలా వెరైటీ దుస్తులు, నగలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
Urvashi Rautela | ఫ్రాన్స్‌లో జరుగుతున్న 76వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో బాలీవుడ్ తారలు హొయలు పోతున్నారు. విభిన్నమైన డ్రెస్సులు, అలంకరణలతో ఆకట్టుకుంటున్నారు. వీరిలో అందరికంటే ఎక్కువగా ఊర్వశి రౌతెలా వెరైటీ దుస్తులు, నగలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా చిలుకలా ఆకుపచ్చ డ్రెస్సు వేసుకుని తన అందాలతో మైమరిపింపజేసింది. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇవాళే కాదు.. మే 16న కూడా ఊర్వశి రౌతెలా ట్రెండింగ్‌గా మారింది. ఆనాడు పింక్ టల్లే గౌనులో అద్భుతంగా కనిపించింది.
కేన్స్ ఫెస్టివల్లో పింక్ కలర్ డ్రెస్సులో బార్బీ డాల్లో ముస్తాబైన ఊర్వశిని చూసి ఎంతోమంది మైమరిచిపోయారు. అయితే అప్పుడు అందరి దృష్టి ఊర్వశి డ్రెస్సు కంటే కూడా ఆమె ధరించిన నగలపైనే పడింది. మెడలో ధరించిన నెక్లెస్, చెవులకు పెట్టుకున్న రింగులు అన్నీ కూడా మొసలి ఆకారంలో ఉండటంతో అందరూ వింతగా చూశారు. దీంతో ఆ నగలపై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తన చర్చ మొదలైంది. వింతగా కనిపిస్తున్న ఆ నగల ధర ఎంత ఉండొచ్చని పలువురు నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. కొందరైతే అవి నకిలీ నగలు అంటూ ఊర్వశి రౌతెలాను ట్రోల్ చేశారు. అంత ప్రతిష్ఠాత్మకమైన ఫిలిం ఫెస్టివల్లో ఫేక్ జ్యువెల్లరీ ధరించడమేంటని ఆమెను టార్గెట్ చేశారు. ఇలా ఊర్వశి రౌతెలా వేసుకున్న మొసలి నెక్లెస్‌పై సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగడంతో ఆమె పీఆర్‌టీమ్ స్పందించింది. ఊర్వశి రౌతెలా వేసుకున్న నగల ధర ఎంతో బయటపెట్టింది.
ఊర్వశి రౌతెలా వేసుకున్న నగలు నకిలీవి కావని.. అసలైనవేనని ఆమె టీమ్ స్పష్టం చేసింది. ఆ మొసలి ఆభరణాల ధర రూ.276 కోట్లు ఉంటుందని వెల్లడించింది. ఊర్వశి ధరించిన నగలు ఆమె ఫ్యాషన్ అభిరుచిని అద్దం పడుతుందని పేర్కొంది. మహిళలు ఎదుర్కొనే సవాళ్లు, విజయాలకు ఇది చిహ్నమని అభిప్రాయపడింది. దీంతో ఊర్వశి ధరించిన మొసలి నెక్లెస్ ధర తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. వామ్మో ! వాటికి అంత ధర ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే దీన్ని అస్సలు నమ్మడం లేదు. నెక్లెస్ ధర అంత ఉంటుందా? జోక్ బాగుందని కౌంటర్లు వేస్తున్నారు.
Read More :
“Urvashi Rautela: కేన్స్‌లో ఊపేస్తున్న ఊర్వశి రౌతేలా.. ప్యారెట్ లుక్‌లో రెడ్‌కార్పెట్‌పై జిగేల్”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

