Viral video | కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో మెరిసిన అందాల భామ ఊర్వశి రౌటెలా.. మొసళ్ల నెక్లెస్‌తో రెడ్ కార్పెట్‌పై ప్రత్యక్షం
Urvashi Rautela | కేన్స్ ఫిలిం ఫెస్టివల్ - 2023లో అందాల భామ ఊర్వశి రౌటెలా స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను అలరించింది. పింక్ డ్రెస్‌లో ఓ దేవకన్యలా మెరిసిపోయింది. ఊర్విశి తన అందంతో అలరించిన విషయం కాసేపు పక్కన పెడితే.. ఈ సందర్భంగా ఆమె తన మెడలో ధరించిన మొసళ్ల నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకుంది.
Urvashi Rautela : కేన్స్ ఫిలిం ఫెస్టివల్ – 2023 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి పలువురు సెలెబ్రిటీలు ఈ వేడుకలకు హాజరయ్యారు. తొలిసారిగా పలువురు బాలీవుడ్ భామలు కేన్స్ రెడ్ కార్పెట్‌పై దర్శనమిచ్చారు. అందాల భామ ఊర్వశి రౌటెలా స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను అలరించింది. పింక్ డ్రెస్‌లో ఓ దేవకన్యలా మెరిసిపోయింది. ఊర్విశి తన అందంతో అలరించిన విషయం కాసేపు పక్కన పెడితే.. ఈ సందర్భంగా ఆమె తన మెడలో ధరించిన మొసళ్ల నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకుంది.
ఎందుకంటే ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకునే ఆ అందాల భామ ధరించిన నెక్లెస్‌లో ఉన్నది సాధారణ డిజైన్ కాదు. గతంలో మనం ఎన్నడూ చూడని ప్రత్యేక డిజైన్. బంగారు మొసళ్లతో ఆ నెక్లెస్‌ను డిజైన్ చేశారు. రెండు మొసళ్లను మెడలో వేలాడేసుకున్నట్లుగా ఆ నెక్లెస్ ఉన్నది. ఆ నెక్లెస్‌కు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్‌ను కూడా ఊర్వశి ధరించింది. ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన తన ఫొటోలు, వీడియోలను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఆ పోస్టుకు 76వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్ ఓపెనింగ్ అనే క్యాప్షన్ ఇచ్చింది.
అయితే, ఆ అందాల రాశి ధరించిన మొసళ్ల నెక్లెస్‌పై నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. మెడలో ఉన్న ఆ మొసలి బతికి వస్తే ఫొటోషూట్ వదిలేసి పారిపోతావా..? అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. అమ్మో ఈ నెక్లెస్ చాలా భయంకరంగా ఉంది అని మరో యూజర్ స్పందించాడు. కేన్స్‌లో ఊర్వశి హిస్టరీ క్రియేట్ చేసిందని ఇంకో యూజర్ ప్రశంసించాడు. గ్రేట్ లుక్ అని, ఫ్యాబులస్ అని, బ్యూటీఫుల్ అని ఇలా రకరకాలుగా మరికొందరు యూజర్స్ కామెంట్స్ పెట్టారు. ఆ వైరల్ దృశ్యాలపై మీరు కూడా ఓ లుక్కేయండి..
మరిన్ని ఫొటోలకు: Urvashi Rautela | కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఊర్వశి రౌటెలా ధగధగలు..
Urvashi Rautela | కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఊర్వశి రౌటెలా ధగధగలు..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

