Urvashi Rautela: కేన్స్‌లో ఊపేస్తున్న ఊర్వశి రౌతేలా.. ప్యారెట్ లుక్‌లో రెడ్‌కార్పెట్‌పై జిగేల్
Urvashi Rautela: ఊర్వశి రౌతేలా తన వెరైటీ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె డిఫరెంట్‌గా కనిపిస్తోంది. అయిదోసారి రెడ్‌కార్పెట్‌లో పాల్గొన్న ఆ భామ.. గ్రీన్ ఫెదర్ డ్రెస్సులో కేక పుట్టించింది.
కేన్స్: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి రౌతేలా(Urvashi Rautela) ఊపేస్తోంది. తన డిఫరెంట్ లుక్స్‌తో కేక పుట్టిస్తోంది. క్లబ్ జీరో ఫిల్మ్ కోసం జరిగిన రెడ్‌కార్పెట్‌లో ఊర్వశి .. చిలుకపచ్చ గౌన్‌లో అట్రాక్ట్ చేసింది. కేన్స్‌లో ఈసారి ఊర్వశి రౌతేలా రకరకాల కాస్టూమ్స్‌తో అదరగొడుతోంది. తాజాగా గ్రీన్ ఫెదర్ డ్రెస్సులోనూ ఊర్శిశి తన అందాల్ని ఆరబోసింది.
ఊర్వశి తాజా లుక్‌పై ఇంటర్నెట్లో ఆమె ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. జియాద్ నాకద్ స్ప్రింగ్ సమ్మర్ కలెక్షన్‌కు చెందిన డ్రెస్సులా ఊర్వశి ఔట్లుక్ ఉంది. ఇక ఆమె తలపాగా కూడా గ్రీన్ కలర్దే ధరించింది. చెవి రింగులు, వేలి రింగులు, ఓపెన్ లాక్స్, బోల్డ్ ఐ మేకప్, ప్లమ్ లిప్‌షేడ్, బ్లష్డ్ చీక్స్‌తో ఊర్వశి .. కేన్స్ రెడ్‌కార్పెట్‌పై స్పెషల్‌గా నిలిచింది.
డైట్ సబ్యా ఫ్యాషన్ కంపెనీ తన ఇన్‌స్టా అకౌంట్లో ఊర్వశి తాజా లుక్‌ను పోస్టు చేసింది. కొందరు నెటిజెన్స్ ఊర్వశి లుక్‌ను పోకేమాన్, ప్యారెట్తో పోల్చారు. కేన్స్ ఫెస్టివల్లో ఊర్వశి పాల్గొనడం ఇది సెకండ్‌టైమ్. ఈసారి ఆమె తన తొలి క్యాట్వాక్లో పింక్ కలర్ డ్రెస్సు వేసుకుంది. సెకండ్ టైమ్ ఆమె ఆరెంజ్ కలర్ గౌన్‌లో అట్రాక్ట్ చేసింది. ఇక మూడవ సారి రెడ్‌కార్పెట్‌పై బ్లూ డ్రెస్సులో జిగేల్మంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

