Shahid Kapoor Next Movie | బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలు తెలుగులో విడుదల కాకపోయిన ‘అర్జున్ రెడ్డి’, ‘జెర్సీ’ వంటి సినిమాలను హిందీలో రీమేక్ చేయడంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఇక బాలీవుడ్లో ఈయనకు విభిన్న సినిమాలను చేసే నటుడుగా మంచి పేరుంది. ప్రస్తుతం ఈయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో రెండు షూటింగ్ పూర్తి చేసుకోగా, ఒకటి షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈయన మరో సినిమాను పట్టాలెక్కించడానికి సిద్ధమైయ్యాడు.
బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో మడాక్ ఫిలింస్ ఒకటి. దినేష్ విజన్ ఈ సంస్థకు నిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. ఈ సంస్థ నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే విధంగా ఉంటుంది. తాజాగా ఈ ప్రొడక్షన్ సంస్థలో సినిమా చేసేందుకు షాహిద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ నిర్మాణ సంస్థలో షాహిద్ ఎప్పుడో సినిమా చేయాల్సిఉంది. కానీ కుదరలేదు. తాజాగా దినేష్.. షాహిద్ కపూర్‌కు ఓ లవ్ స్టోరీని వినిపించాడట. కథ బాగా నచ్చడంతో షాహిద్ వెంటనే ఓకే చేశాడట. కాగా ఈ చిత్ర దర్శకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం షాహిద్ ‘అలీ అబ్బాస్ జాఫర్’, ‘ఫర్జీ’ చిత్రాలను పూర్తి చేశాడు.