Bobby | టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరు బాబీ. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, పవన్ కల్యాణ్, రవితేజ లాంటి లీడింగ్ హీరోలతో సినిమాలు చేసి వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. బాబీ, పవన్ కల్యాణ్‌తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేశాడని తెలిసిందే. అయితే ఈ ఇద్దరు ఒక చోట కలిసి సందడి చేసిన స్టిల్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్‌ను కలిసిన సందర్భాన్ని తెలియజేస్తూ బాబీ ఎక్స్‌లో పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆయనను కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం..ఆయనతో పనిచేసిన టైంలో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్లేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషిలా కనిపించారు..రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం.. కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరంలా కనిపించారు. అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను.
చివరగా ఒక్క మాట చెబుతున్నాను. జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం… జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను.. జైహింద్.. అంటూ పవన్ కల్యాణ్‌తో దిగిన సెల్పీని షేర్ చేశాడు. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతుండగా.. ఇద్దరూ మరో సినిమా కోసం ఏమైనా రెడీ అవుతున్నారా..? ఏంటి అనే చర్చ మొదలైంది. మరి ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే మూవీ లవర్స్‌తోపాటు అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇద్దరు కలవడం వెనుకున్న సీక్రెట్ ఏంటనేది తెలియాల్సి ఉంది.
US-Iran ceasefire | ఇరాన్-అమెరికా కాల్పుల విరమణపై స్పందించిన ఇండియా.. ఏం చెప్పిందంటే
ACB Raid | రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్ అసిస్టెంట్
Allu arjun | ఐకాన్ స్టార్‌కు గీతా ఆర్ట్స్ స్పెషల్ గిఫ్ట్.. అదిరిపోయే బర్త్‌డే మ్యాషప్ వీడియో